Valuable Indian Celebrities | భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీలు వీరే..!

Valuable Indian Celebrities | భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీలు వీరే..!

ఫేమ్, ఫాలోయింగ్, బ్రాండ్ విలువ, మార్కెట్ ప్రభావం.. ఈ నాలుగు అంశాల్లో సత్తా చాటిన సెలబ్రిటీల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా 2026 విడుదల చేసింది. భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీలుగా (Valuable Indian Celebrities) నిలిచిన టాప్-5 ప్రముఖుల జాబితాలో క్రికెట్ , సినిమా రంగాలదే పూర్తి ఆధిపత్యం కనిపించింది.

టాప్ 5లో ఉన్నది వీరే

ఈ జాబితాలో అగ్రస్థానాన్ని భారత క్రికెటర్, ర‌న్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆదరణ, భారీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రభావం ఆయనను దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలబెట్టాయి.

రెండో స్థానంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిలిచాడు. మూడు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్న షారుఖ్, దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యంత గుర్తింపు పొందిన భారతీయ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.

మూడో స్థానాన్ని ప్రియాంక చోప్రా దక్కించుకుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన ప్రియాంక‌, గ్లోబల్ స్థాయిలో భారతీయ ప్రతిభకు ప్రతినిధిగా నిలుస్తూ అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. నాలుగో స్థానంలో ఎంఎస్ ధోనీ నిలిచాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఐదో స్థానంలో రణ్‌వీర్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. తన ఎనర్జిటిక్ నటన, విభిన్నమైన స్టైల్, వరుస విజయాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రణ్‌వీర్, యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్‌లలో ఒకడిగా నిలిచాడు.

క్రీడలు, సినిమాలదే హవా

2026 అత్యంత విలువైన భారతీయ సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే.. దేశంలో క్రీడలు, వినోద రంగాల ప్రభావం ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. టాప్-5లో ఇద్దరు క్రికెటర్లు, ముగ్గురు సినీ ప్రముఖులు చోటు దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం, ఎంఎస్ ధోనీ టాప్-5లో కొనసాగడం భారత క్రికెటర్ల బ్రాండ్ విలువ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. మరోవైపు షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్ వంటి సినీ తారలు కూడా తమ స్టార్‌డమ్‌ను మార్కెట్ విలువగా మలుచుకుంటూ ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

Leave a Reply