ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించండి

ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించండి

– కూలీలకు ఉపాధ్యాయుల పిలుపు

దండేపల్లి, ఆంధ్రప్రభ:
పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ప్రోత్సహిస్తూ దండేపల్లి మండలం కాసిపేట గ్రామంలో సోమవారం వెల్గనూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో “బడి బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలు సేకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.

అనంతరం గ్రామ శివారులోని చెరువు వద్ద ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలను ఉపాధ్యాయులు కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలు, విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను వివరించి, తమ పిల్లలను వెల్గనూర్ ఉన్నత పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న, ఉపాధ్యాయులు రజిని, వేణుగోపాల్, ప్రవీణ్, గంగన్న, పద్మావతి, రమాదేవి, వీణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply