AP | కుప్పంలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం..

AP | కుప్పంలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం..

  • ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్యే శ్రీకాంత్ తొలగింపు?

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కుప్పం ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన యువ నాయకుడు శ్రీకాంత్‌ను కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

అమరావతిలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. కుప్పంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన చంద్రబాబు, పలువురు ముఖ్య నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొందరు కీలక నేతలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ను తన వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) నియమించినట్లు తెలుస్తోంది.

Leave a Reply