Samantha | ‘తస్సాదియా’ హవా మామూలుగా లేదు..

Samantha | ‘తస్సాదియా’ హవా మామూలుగా లేదు..

  • సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’ సాంగ్!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవ‌ల‌ విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియా’ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో 23మిలియ‌న్ వ్యూస్ తో.. ఇప్పటికే 92 వేలకుపైగా షార్ట్ వీడియోలు రూపొందించగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 59 వేలకుపైగా రీల్స్, షార్ట్ వీడియోలు క్రియేట్ అయ్యాయి. దీంతో ‘తస్సాదియా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

పాట విడుదలైనప్పటి నుంచి యువతలో మంచి ఆదరణ పొందుతోంది. ఆకట్టుకునే బీట్‌లు, స్టెప్పులు, విజువల్స్ కారణంగా సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే ‘మా ఇంటి బంగారం’కు భారీ బజ్ ఏర్పడింది. సమంత నటిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply