పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డికి పరామర్శ

పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డికి పరామర్శ

బిక్కనూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న నాయకులు ఆయనను కలిశారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించిన వారిలో కంచర్ల గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కుమ్మరి చంద్రం, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంబాటి సాయ గౌడ్, మాజీ వార్డు సభ్యులు శేఖర్ రెడ్డి, మహేందర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply