జానకంపేటలో వెలుగులు తిరిగి వచ్చాయి
జానకంపేటలో వెలుగులు తిరిగి వచ్చాయి
- మరమ్మతుల తర్వాత హైమాస్ట్ లైట్లు పునరుద్ధరణ
ఎడపల్లి, ఆంధ్రప్రభ:
ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారి వెంట, శివాజీ చౌక్ వద్ద పనిచేయని హైమాస్ట్ లైట్లను ఆదివారం పునరుద్ధరించారు. రూర్బన్ పథకంలో భాగంగా సుమారు మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లలో కొన్ని పాడవడంతో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతన బల్బులు అమర్చారు.
రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు చేపట్టి లైట్లను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు.

