పగలే వెలిగిన వీధి దీపాలు.. ప్రజాధనం వృథాపై ఆందోళన
పగలే వెలిగిన వీధి దీపాలు.. ప్రజాధనం వృథాపై ఆందోళన
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ ప్రాంతంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాటాపూర్ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలోని కరెంట్ పోల్‌పై అమర్చిన వీధి దీపం పగటి సమయంలోనూ వెలుగుతుండగా, రైల్వే గేట్ వద్ద ఉన్న మరో వీధి దీపం కూడా నిరంతరం వెలుగుతుండటం గమనార్హం.
విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఇలా పగటి వేళల్లోనే వీధి దీపాలు వెలుగుతుండటంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షించి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

