Bear Alert | భక్తులను భయపెట్టిన ఎలుగుబంటి

Bear Alert | భక్తులను భయపెట్టిన ఎలుగుబంటి

Bear Alert | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి సమీపంలోని వినాయక ఆలయం వద్ద ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

అలిపిరి చెక్‌పోస్టు నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వినాయక ఆలయం పరిసరాల్లో ఎలుగుబంటి తినుబండారాల కోసం చెత్తకుండీల వద్ద తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఎలుగుబంటి సంచరించడాన్ని గమనించిన భక్తులు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తరిమి పంపారు. దీంతో అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

తిరుమల అటవీ ప్రాంతాలకు సమీపంలో అడవి జంతువుల సంచారం సహజమని అధికారులు తెలిపారు. కనుమదారిలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, జంతువులు కనిపిస్తే వాటికి దగ్గరగా వెళ్లకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Leave a Reply