NIMS | నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం
NIMS | నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం
NIMS | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్‌ను నియమించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ శనివారం జి.ఓ.ఆర్.టి. నెం.179ను జారీ చేసింది.
ప్రస్తుతం నిమ్స్‌లో యూరాలజీ విభాగం ప్రొఫెసర్ అండ్ విభాగాధిపతిగా (హెచ్‌వోడీ) విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాహుల్ దేవరాజ్‌ను నిమ్స్ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిమ్స్ చట్టం–1989లోని సెక్షన్ 17(1) ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
డాక్టర్ రాహుల్ దేవరాజ్ పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
నిమ్స్ రాష్ట్రంలోని ప్రముఖ వైద్య విద్య, వైద్య సేవల సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సుదీర్ఘ వైద్య అనుభవం, యూరాలజీ రంగంలో చేసిన సేవలు నిమ్స్ అభివృద్ధికి మరింత దోహదపడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

