కనకదుర్గమ్మ సేవలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు రమణ

కనకదుర్గమ్మ సేవలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు రమణ

ఆలయ మర్యాదలతో స్వాగతం.. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాల అందజేత

విజయవాడ, ఆంధ్రప్రభ-ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఉదయం శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్‌బాబు ఆలయ మర్యాదలతో రమణకు స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు అమ్మవారి ప్రసాదంతో పాటు శేష వస్త్రాలను రమణకు అందజేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply