నాగుర్లపల్లిలో వ్యక్తిపై కత్తులు, కర్రలతో దాడి.. తీవ్ర గాయాలు
నాగుర్లపల్లిలో వ్యక్తిపై కత్తులు, కర్రలతో దాడి.. తీవ్ర గాయాలు
ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.. కారణాలపై పోలీసుల ఆరా
వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై కత్తులు, కర్రలతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన గాదెగోని రాజుపై అదే గ్రామానికి చెందిన తెప్ప చిరంజీవి, తెప్ప రాజయ్య, తెప్ప కొమురయ్య, తెప్ప రమేష్‌తో పాటు మరో నలుగురు మహిళలు దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. దాడికి దారితీసిన పరిస్థితులు, వివాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
