మెరుగైన వైద్యం కోసం రూ 11 లక్షల ఎల్ ఓ సీ అందజేత..
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ ను శనివారం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, 48 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ తో కలిసి అందజేశారు.
44 వ డివిజన్, రామ రాజ్య నగర్ కు చెందిన సంభాని గంగమ్మ (54) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది, ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో బీజేపీనాయకుడు దేవిన హరిప్రసాద్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేయగా మంజూరైన రూ 11లక్షల 4 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.
