పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు బలమైన ఆయుధం: న్యాయమూర్తి రేణుకలత

బాపట్ల, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పచ్చదనం పెంపొందించడమే కాలుష్య నియంత్రణకు, వాతావరణ సమతుల్యతకు ప్రధాన మార్గమని అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. రేణుకలత అన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల కోర్టు ఆవరణలో న్యాయ సేవా విభాగం ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. రేణుకలత, బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విన్నకోట సత్యప్రసాద్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి రేణుకలత మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

న్యాయ సేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో కోర్టు ఆవరణలో పలు మొక్కలను నాటినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply