పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి: మున్సిపల్ చైర్మన్

పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి: మున్సిపల్ చైర్మన్

తొర్రూరు, ఆంధ్రప్రభ:

పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకారం అందించాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం డివిజన్ కేంద్రంలోని కూరగాయల అంగడి ప్రాంగణంలో 1, 2, 3 వార్డులకు సంబంధించిన వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు.

200 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించే వారు తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, కౌన్సిలర్లు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, తూర్పాటి రవి, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయ, మేనేజర్ కట్టస్వామి, వార్డు అధికారులు పట్టాభి, కనకరాజు, రాంబాయి, వెంకన్న, ఉమేష్, మీనేశ్వర్, ముస్తాఫా, రవీందర్, పవన్ కళ్యాణ్, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply