Free WiFi | మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చు.. జాగ్రత్త!

Free WiFi | మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చు.. జాగ్రత్త!

Free WiFi | ఉచిత వైఫై వెనుక దాగి ఉన్న సైబర్ ముప్పు
పబ్లిక్ వైఫై వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం
సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?
సైబర్ నేరాలకు గురైతే వెంటనే చేయాల్సింది

Free WiFi | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: డిజిటల్‌ యుగంలో ఇంటర్‌ నెట్‌ వినియోగం పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త మార్గలను అన్వేషిస్తున్నారు. ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్లిన ఉచిత వైఫై కోసం వెతుకుతూ.. ఉంటాం.. బస్‌స్టాండ్‌ లలో, రైల్వే స్టేషన్‌లు, కేఫ్‌ లలో దొరికే ఉచిత వైఫై మనకు వరంలా అనిపిస్తుంది.

కానీ ఆ ఉచితం వెనుక సైబర్‌ నేరగాళ్ల ఉచ్చు కూడా ఉండవచ్చని మీకు తెలుసా? మీ వ్యక్తిగా సమాచారన్నీ బ్యాంక్‌ ఖాతాలను తస్కరించేందుకు సైబర్‌ నేరగాళ్లు ఈ ఫ్రీ వైఫైని ఆశ్రంగా వాడుతున్నారు. ఇలాంటి ఉచిత వైఫై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన పాటించడం ద్వారా మన డిజిటల్ భద్రతను కాపాడుకోవచ్చన్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

ఆర్థిక లావాదేవీలకు నో: పబ్లిక్ వైఫైని వాడుతున్నప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్స్ ద్వారా లావాదేవీలు చేయకండి.

అత్యవసరం అయితేనే: పబ్లిక్ వైఫై వాడకం అనేది కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి.

పాప్-అప్‌ల పట్ల జాగ్రత్త: ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అపరిచిత వెబ్‌సైట్ల నుంచి వచ్చే పాప్-అప్ ప్రకటనలను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించండి.

లాగిన్ చేయకండి: పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లలో బ్యాంకింగ్ లాగిన్ వివరాలను ఎంటర్ చేయడం ప్రమాదకరం.

అప్రమత్తతే ఆయుధం..
సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ పొందడానికి అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం. ఒకవేళ మీరు ఎప్పుడైనా సైబర్ మోసానికి గురైనట్లు అనిపిస్తే లేదా ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే, వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply