Cabinet | విమానయాన రంగానికి కేంద్రం భారీ ఊరట..

Cabinet | విమానయాన రంగానికి కేంద్రం భారీ ఊరట..

  • ATF ధరల స్థిరీకరణకు రూ.10,000 కోట్ల నిధి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ATF ధరలు అనూహ్యంగా పెరగడంతో విమానయాన సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకు కేంద్రం కీల‌క నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో షెడ్యూల్డ్ భారతీయ విమానయాన సంస్థల కోసం ATF ధరల స్థిరీకరణ నిధి (Price Stabilization Fund) ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) గరిష్ఠంగా రూ.10,000 కోట్ల వరకు వడ్డీ రహిత ఆర్థిక సహాయం అందించనుంది.

2026 మార్చిలో లీటరుకు రూ.60.50గా ఉన్న విమాన ఇంధనం ధర, మే నాటికి రూ.142కు చేరుకోవడం విమానయాన సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం మోపింది. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించి, విమాన సర్వీసులు అంతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ ఫండ్ ద్వారా విమానయాన సంస్థలకు ఇంధన వ్యయాల్లో స్థిరత్వం కల్పించడంతో పాటు ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా విమానయాన రంగానికి అనుబంధంగా ఉన్న సుమారు 77 లక్షల ఉద్యోగాల పరిరక్షణకు కూడా ఈ నిర్ణయం దోహదపడనుంది. విమాన సర్వీసుల కొనసాగింపు, పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అనుసంధానానికి ఈ చర్య కీలకంగా మారనుందని కేంద్రం పేర్కొంది.

Leave a Reply