ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
వాడవాడలో ఎగిరిన జాతీయ పతాకాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడవాడలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి, జాతీయ గీతం, రాష్ట్ర గీతాలను ఆలపించారు. చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ వెలమ శేఖర్ రెడ్డి, డివిజనల్ పోలీస్ కార్యాలయం వద్ద డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
మార్కెట్ కార్యాలయం వద్ద చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వీరాబాయి, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో ముత్యాల నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బీజేపీ మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మల్కాపురం గ్రామ పంచాయతీ ముందు సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్, స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీ ముందు సర్పంచ్ బీమిడి ప్రదీప్ జీ, అరెగూడెం గ్రామ పంచాయతీ ముందు సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి, అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ముందు సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
