Drunk And Drive | ఏకంగా ఎంత మంది పట్టుబడ్డారంటే……

Drunk And Drive | ఏకంగా ఎంత మంది పట్టుబడ్డారంటే……

475 మంది పట్టుబ‌డ్డారు

Drunk And Drive | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మే 29, 30 తేదీల్లో ట్రాఫిక్ పోలీసులు “డ్రంక్ అండ్ డ్రైవ్” స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డుపుతూ మొత్తం 475 మందిని పట్టుబ‌డ్డారు. ఇందులో 397 మంది ద్విచ‌క్ర వాహ‌న‌దారులు ఉన్నారు. డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్న 9 కేసుల్లో రక్తంలో మద్యం శాతం (BAC) 0.3 శాతంగా నమోదైంది. హైదరాబాద్ ట్రాఫిక్ అధికారుల ప్రకారం, నగరంలో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధించబడింది.

జాయింట్ సీపీ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లపై భద్రతను పెంచి, రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యం ఉందని తెలిపారు. ఇలాంటి డ్రైవ్‌లు సాధారణంగా వారం వారీ లేదా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహిస్తారు. డ్రైవర్స్‌ మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకూడదని, భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. రోడ్లపై డ్రంక్ డ్రైవింగ్‌ను నివారించడం కోసం పోలీసులు మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.