పోలీసుల ద్వారా ఇసుక లారీ లాపి ధాన్యం తరలించండి

-పోలీసుల ద్వారా ఇసుక లారీ లాపి ధాన్యం తరలించండి

  • మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి ఎండనక, వాననక ఇబ్బందులు పడుతూ పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు సరిగా లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. రోహిణి కార్తి వచ్చింది రైతులు తిరిగి నార్లు పోసుకొని సాగు చేయాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. ధాన్యం కొనుగోలు కాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి 48 గంటల్లో ధాన్యం కొనుగోలను పూర్తి చేసి తరలించకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంటాలు వేసిన తరలించేందుకు లారీలు లేవంటూ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారని అన్నారు.

మహిళలు, రైతులు అడ్డుకుంటే లారీలు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి పోలీసుల ద్వారా ప్రత్యేకంగా ఇసుక లారీలను మళ్లించి ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని డాక్టర్ రాజయ్య సూచించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ సజావుగా సాగిందని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించి వారి కండగా నిలవాలని డాక్టర్ రాజయ్య డిమాండ్ చేశారు.

స్టేషన్గన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి రాజభోగాల అనుభవిస్తున్నాడని విమర్శించారు. రైతుల సమస్యల పైన కడియం శ్రీహరి ఏనాడైనా ఆలోచించారా అంటూ డాక్టర్ రాజయ్య ప్రశ్నించారు. బిఆర్ఎస్ హయాంలో వచ్చిన నీళ్లతో సాగైనా భూములకదనంగా ఒక ఎకరానికయినా నీళ్లు అందించారని డాక్టర్ రాజయ్య.. కడియం శ్రీహరిని నిలదీశారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply