Water Pollution Crisis : పంట కాలవల్లో ప్లాస్టిక్ వరవళ్లు

Water Pollution Crisis : పంట కాలవల్లో ప్లాస్టిక్ వరవళ్లు
- మంచి నీటికి కటకట..
- ఆక్వా డ్రెయినేజీ సరేసరి
- రోగాలతో జనం సతమతం
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ:

ఎక్కడ చూసినా తాగునీరు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతుంది. పరిశుభ్రతకు నిలయాలుగా ఉండాల్సిన తాగునీటి కాలువలు వ్యర్ధాలకు నిలయాలుగా మారుతున్నాయి. నీటి కాలుష్యంతో నూటికి 90 శాతం రోగాలు బారిన ప్రజలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో చుట్టూ నీటి వనరులు పుష్కలంగా ఉన్న తాగేందుకు గుక్కెడు స్వచ్ఛమైన నీరు కరువైంది. ఎటు చూసినా పంట కాలువలు కాలుష్య కారాకారాలుగా పరిశ్రమల వ్యర్ధాలకు నిలయాలుగా మారుతున్నాయి మురికి కాలువలకు చేరవలసిన నీరు కూడా పంట కాలవల్లోకి చేరడంతో ఈ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. నీటి కాలుష్యం వల్ల గత దశాబ్ద కాలంలో ప్రజలు కిడ్నీ , ఉదర సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిడ్నీ రోగుల సంఖ్య కూడా జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. జిల్లాలో సుమారు 18 లక్షల మంది నివసిస్తున్నారు. 409 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆకివీడు నగర పంచాయతీ ఒకటి ఉంది. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీటినందించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజల నుంచి అందాల్సిన సహకారం కూడా పూర్తిస్థాయిలో అందకపోవడంతో తాగునీరు కలుషితమయంగా మారింది. జిల్లాలో తాగునీటి కాలవల కాలుష్యం, కారణాలు, ఇబ్బందులపై చర్చ సాగుతున్నా పూర్తస్థాయి పరిష్కారం లభించడం లేదు. తాగునీటి కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. ప్రధానమైన గోదావరి నదిలోనే నీటి కాలుష్యం మొదలైతే నది నుంచి వచ్చే నీరు కాలువలకు చేరి అక్కడి నుంచి చెరువులు కు చేరేసరికి ప్రమాదకరంగా తాగునీరు మారుతుంది.
Water Pollution Crisis ఆక్వాతో కాలుష్యం కాటు

జిల్లాలో ఆక్వా సాగు పెరగడంతో అదే స్థాయిలో నీటి కాలుష్యం కూడా పెరిగింది గ్రామాలకు సమీపంలో సాగునీటి కాలువలకు ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వేయడంతో ఈ చెరువు నుంచి వచ్చే కలుషిత నీరు పంట కాలవల్లోకి చేరి నీరు తాగడానికి పనికిరాకుండా మారుతుంది. చెరువుల సాగు కోసం ఉపయోగించి రకరకాల రసాయనాలు కలిసిన నీరు కాలువల ద్వారా పంట బోధన ద్వారా సాగునీటి వ్యవస్థను మొత్తం చుట్టుముట్టేస్తుంది కొన్నిచోట్ల భూగర్భ జలాల సైతం కలుస్తుంద మారుతున్నాయి.
Water Pollution Crisis నీటి శుద్ధి కేంద్రాలే దిక్కు…

పల్లెల్లో .. పట్టణాల్లో కుళాయిలకు సరఫరా అయ్యే నీరు చాలాచోట్ల అపరిశుభ్రంగా తాగడానికి పనికిరాని విధంగా ఉంటుంది. చేసేదేం లేక ప్రజలు ఈ నీటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుని తాగునీటి కోసం నీటి శుద్ధి ప్లాంట్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ లే అధికంగా కనిపిస్తున్నాయి. ఆ ప్లాంట్ లో సైతం పరిశుభ్రమైన నీరు లభిస్తుందనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కనీస తనిఖీలు లేకపోవడం వారు పట్టిందే తాగునీరు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.
ఈ కలుషిత జలాల వాడకంతో ప్రజలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
