క్రికెట్ అభిమానులకు ఒలింపిక్స్ నిర్వహుకులు గుడ్ న్యూస్ చెప్పారు. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చోటు లభించింది. తాజాగా ఈ ఒలింపిక్స్ లో క్రికెట్ కు సంబంధించిన మరో కొత్త విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.
టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. పురుషులు, మహిళల విభాగాలలో ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టు నుండి 15 మంది చొప్పున మొత్తం 90 మంది క్రికెటర్లకు అనుమతి ఉంది. ఇదిలా ఉండగా, ఆతిథ్య దేశమైన అమెరికాకు నేరుగా ప్రవేశం లభించే అవకాశం ఉంది. మిగిలిన జట్లను ఎలా ఎంపిక చేస్తారు అన్నది ఇంకా నిర్ణయించలేదు.
క్రికెట్‌తో పాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్ వంటి క్రీడలకు అవకాశం కల్పించారు. కాగా, 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ ను తొలిసారి నిర్వహించారు. అప్పుడు బ్రిటన్ – ఫ్యాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగ్గా.. బ్రిటన్ విజయం సాధించింది. ఇప్పుడు దాదాపు, 128 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కింది.
ఎంపిక ఎలా..
అయితే, ఒలింపిక్స్ కు జట్లను ఎలా ఎంపిక చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఒలింపిక్స్ కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆతిథ్య దేశమైన అమెరికా నేరుగా ప్రవేశించే అవకాశం ఉండటంతో, ర్యాంకింగ్స్ లో ఉన్న జట్లు టాప్-5 స్థానాలకు పోటీ పడవచ్చు.