ఒంగోలు నూతన కమిషనర్ గా వెంకట కృష్ణయ్య

ఒంగోలు నూతన కమిషనర్ గా వెంకట కృష్ణయ్య
ఒంగోలు. ఆంధ్రప్రభ : ఒంగోలు నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన టి.వెంకట కృష్ణయ్య శాసనసభ్యులు శ్దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కి జనార్దన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నగర పాలక సంస్థ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల ప్రజా అవసరాలపై సవివరంగా చర్చించారు. ఒంగోలు నగరాన్ని ఆధునిక, శుభ్రమైన, పర్యాటక సౌందర్యంతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనర్ శాసనసభ్యులు జనార్దన్ సూచించారు.
