సౌకర్యాలు కల్పించండి..

కడెం మాజీ ఎంపీపీ బి. అమ్మి బాపూరావు
కడెం, మే 14 ఆంధ్రప్రభ కడెం మండలంలోని పాండాపూర్ గ్రామం వద్ద ఆటవిశాఖ చెక్ పోస్ట్ టోల్ గేటు వద్ద ప్రజలకు ప్రయాణికులకు వాహనదారులకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కడెం మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు అన్నారు గురువారం మండల కేంద్రమైన కడెంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ..
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని కడం మండల పాండవాపూర్ ఆటవిశాఖ చెక్ పోస్ట్ వద్ద టోల్ గేట్ ఇటీవల ప్రారంభమైందన్నారు కాగా టోల్గేట్ వద్ద ఎలాంటి వసతులు ఏర్పాటు లేక ప్రజలకు ఇబ్బందులు కలిగించే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
టోల్ గేట్‌కు కనీసం ఒక కిలో మీటర్ల దూరం నుంచే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు అలాగే స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రదేశాలలో స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు
అదేవిధంగా రోడ్ ఫోర్‌వే లైన్ విధానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సేవలు అందించేందుకు టోల్ గేట్ వద్ద ఎప్పుడూ ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ఫారెస్ట్ అధికారులు ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడకూడదని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు ఆట విశాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి కోరారు.
