ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి
కమిటీ వైస్ చైర్మన్ గా కండక్టర్ తిమ్మప్ప ప్రమాణ స్వీకారం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన వైస్ చైర్మన్ గా బుధవారం కండక్టర్ తిమ్మప్ప ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య సేవల సంస్థ ( డి సి హెచ్ ఎస్ ) ఆధ్వర్యంలో ఉరవకొండ ఆసుపత్రి అభివృద్ధి కోసం, నూతన కమిటీని అధికారికంగా నియమించిన విషయం తెలిసిందే. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా ఉరవకొండ పట్టణానికి చెందిన కండక్టర్ తిమ్మప్ప, కన్వీనర్ గా డాక్టర్ ఎన్. వి. ఎస్ చౌదరి, సభ్యులుగా ఉరవకొండ ఎంపీడీవో రవి ప్రసాద్, ఉరవకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి మహమ్మద్ రఫీ, సరస్వతి, శంకర్ సుదర్శన్ లు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో, మార్గదర్శకత్వంతో ఆసుపత్రికి అభివృద్ధికి, రోగులకు ఎరుగైన సేవలు అందించడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ కు, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేపట్టిన సందర్భంగా వారికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవినేని పురుషోత్తం, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవ నంద, పెన్నాహోబిలం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, మాజీ ఎంపీపీలు సుంకరత్నమ్మ, కుళ్లాయప్ప, మాజీ సర్పంచ్ లు మోపిడి గోవిందు, వెంకటేశులు, మాజీ వార్డు సభ్యులు రామాంజనేయులు, పెన్నాహోబిలం ఆలయ కమిటీ సభ్యులు మీనుగ రామకృష్ణ, టిడిపి మహిళా విభాగం జిల్లా తెలుగు మహిళా నాయకురాలు దేవికాదేవి, టిడిపి నాయకు లు నిరంజన్ గౌడ్, రాంబాబులు, చలపతి, రఘు రాములు, నరేష్ వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానించి సత్కరించారు.
