జర్నలిస్టుల సమస్యలు టియుడబ్ల్యూజే (ఐజేయు) సాధ్యం

జర్నలిస్టుల సమస్యలు టియుడబ్ల్యూజే (ఐజేయు) సాధ్యం
చిట్యాల, మే 13 (ఆంధ్రప్రభ)
జర్నలిస్టుల సమస్యలు టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘం వల్లే పరిష్కారం అవుతాయని జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) లో సభ్యత్వం తీసుకోవాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం జరిగిన యూనియన్ మండల శాఖ సర్వసభ్య సమావేశం మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా క్లబ్ కార్యదర్శి పెద్ది నరేందర్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం నుండి మండల కేంద్రాల వరకు పనిచేసే జర్నలిస్టులకు అధిక సంఖ్యలో అక్రిడియేషన్ కార్డుల మంజూరుకు ఎనలేని కృషి చేసిన సంఘం టీయుడబ్ల్యూజే (ఐజెయు) అని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో యూనియన్ నాయకులు మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం సమస్యల పరిష్కారంలో తమ యూనియన్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులందరూ సభ్యత్వాలను స్వీకరించాలని బయన్న విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు మెండే వెంకన్న, పోకల కరుణాకర్, కోశాధికారి చెరిపల్లి శ్రీనివాసులు, నాయకులు మిరియాల ప్రకాష్, ఏళ్ల వెంకన్న, కూనూరు మధు, అమరోజు వెంకన్న, జిట్ట మల్లేష్, సురేపేల్లి సూర్యనారాయణ, పాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు..
