గ్రామ స్థాయిలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలి…

గ్రామ స్థాయిలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలి…
తొర్రూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవణ్ కుమార్. తొర్రూరు టౌను మే 13 (ఆంధ్రప్రభ) పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా వారోత్సవాలు సందర్భంగా బుధవారం గ్రామ స్థాయి అకాడమిక్ సపోర్ట్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యాభివృద్ధి,
విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం, గ్రామ స్థాయిలో విద్యా ప్రమాణాల పెంపుపై విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులుడి. మహేందర్ ( చెర్లపాలెం)
చిదురాల కృష్ణమూర్తి (చికటాయపాలెం)
ఎం. సునీత (అమ్మాపురం) స్వాతి (హరిపిరాల)
వెలికట్టె బి. శ్రీనివాస్
వై. వెంకట్ రెడ్డి ( కర్కాల)
బి. రమేష్ (మడూర్)
ఈ. మాధవ రెడ్డి (ఫతేపూర్)
ఎన్. రామలింగం(మడిపల్లి) కె. లింగమూర్తి( సోమారం) అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..
