సర్పంచుల అవగాహన సదస్సుకు స్పందన కరువు

సర్పంచుల అవగాహన సదస్సుకు స్పందన కరువు
గూడూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని దృడ సంకల్పంతో స్థానిక ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సు లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం గూడూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్పంచ్ ల అవగాహన కార్యక్రమానికి స్పందన కరువైంది మండలంలో 41 మంది సర్పంచ్లు ఉండగా ఏడుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి కార్పొరేట్ దీటుగా విద్యను అందించి డిజిటల్ తరగతుల బోధన సర్పంచుల బాధ్యత అనే అంశంపై అవగాహన కల్పించినప్పటికీ సర్పంచులు ఎవరు రాకపోవడంతో పలు ప్రశ్నలకు తావిస్తోంది అధికారుల సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యమా.. లేదా ఇతరాత్ర పనుల రీత్యా రాకపోవడం అనేది అనుమానం వ్యక్తం అవుతుంది. అందరికీ ఎమ్మార్సీ పరిధిలో ఆరుగురు సిఆర్పిలు ఐదుగురు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ఉన్నప్పటికీ సర్పంచ్లు రాకపోవడం గమనార్వం.. ఇట్టి విషయమై మండల విద్యాధికారి సుజాతను వివరణ కోరగా మేము సమాచారం ఇచ్చాము వారి రాకపోవడం మా బాధ్యత కాదని వారు అన్నారు.ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు.
