పట్టణ పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు

పట్టణ పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు
ప్రతి రోజు ఉదయం పారిశుధ్య తనిఖీలు
సదాశివపేట మున్సిపల్ కమిషనర్ టి.శివాజీ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సదాశివపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి పారిశుధ్య పరిస్థితులను పరిశీలిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు అందిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, డ్రైనేజీలు తదితర ప్రాంతాల్లో శుభ్రత పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా ప్రజలు సహకరించాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యమని కమిషనర్ టి.శివాజీ తెలిపారు. పట్టణ ప్రజలు కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ వాహనాలకు అందజేయాలని ఆయన కోరారు.
