Donald Trump China Visit | ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీపై ప్రపంచ దృష్టి

Donald Trump China Visit | ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీపై ప్రపంచ దృష్టి

Donald Trump China Visit | తైవాన్‌ అంశం చర్చల్లో కేంద్రబిందువు
అమెరికా-చైనా వ్యూహాత్మక ఒప్పందాలు
సెమీకండక్టర్ల కోసం పెరుగుతున్న పోటీ
ఇండో పసిఫిక్‌లో ఆధిపత్య పోరు
టీఎస్‌ఎంసీపై అమెరికా ప్రత్యేక దృష్టి
మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్‌ వ్యూహం

Donald Trump China Visit | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 14, 15 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. గతంలో కొద్ది మంది అమెరికా అధ్యక్షులు కొన్ని అంచనాలతోనూ, అస్థిర పరిస్థితుల్లోనూ చైనా పర్యటన జరిపారు. ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు కడపటిసారి 2025 అక్టోబర్‌లో దక్షిణ కొరియా బుసాన్‌లో కలుసుకున్నారు. ఆసియా పసిఫిక్‌ ఆర్థిక శిఖరాగ్ర సహకార శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా వారు కలుసుకున్నారు. ఆ సమావేశం విజయవంతంగా జరిగిందని రెండు దేశాల ప్రతినిధులు ఆ తర్వాత ప్రకటించారు.

అరుదైన ఖనిజాల ఉత్పత్తి, కీలకమైన ఖనిజాల విషయంలో స్వయం ప్రతిపత్తిగల చెయిన్‌ను నిర్మించడం లక్ష్యంగా అప్పట్లో ట్రంప్‌ చైనా పర్యటన జరిపారు. ఆ చెయిన్‌కు అవరోధం కల్పిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా, మిలటరీ సామర్థ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకు బదులుగా, కృత్రిమ మేధకు సంబంధించి ప్రోసెసర్ల ఎగుమతులపై పరిమితులను ఎత్తివేయాలని ట్రంప్‌ని జిన్‌పింగ్‌ కోరారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చర్చలు జరుపుతారు. అదనంగా తైవాన్‌ సమస్య ఉండనే ఉంది. ఎపెక్‌ తదుపరి శిఖరాగ్ర సమావేశం త్వరలో బీజింగ్‌లో జరుగుతుంది.

తైవాన్‌పై చైనా దృష్టి

అమెరికాతో జరిపే తదుపరి చర్చల్లో తైవాన్‌ ప్రధానాంశంగా ఉంటుందని చైనీస్‌ నాయకులు పేర్కొంటున్నారు. ట్రంప్‌, జిన్‌పింగ్‌ల సమావేశం ఒక నెలరోజుల ఆలస్యంగా ఏర్పాటైంది. ఇరాన్‌పై సైనిక చర్య కారణంగా ఈ చర్చలు వాయిదా పడ్డాయి.

ఈసారి జరిపే ట్రంప్‌ పర్యటన వృథాకాకుండా చూసుకోవాలని చైనీస్‌ నాయకులు అనుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలను విస్తరింపజేసే ఆలోచనలో ఉన్న చైనా, బీజింగ్‌లో జరుగుతున్న ఈ సమావేశాన్ని మరింత విస్తృతమైన రీతిలో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నది. ముఖ్యంగా, తైవాన్‌ని చైనాలో కలుపుకోవాలన్న ప్రతిపాదనను చైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చైనా ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యాన్ని తగ్గించేందుకు చైనా ప్రయత్నించవచ్చు. చైనా తన మందుగుండు నిల్వలు వృథా కాకుండా చూసుకోవడానికి, సంప్రదింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నది.

ఇందుకు సంబంధించిన సంకేతాలు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ బుసాన్‌ నుంచి బయలుదేరడానికి ఒక వారం ముందే తెలియవచ్చాయి. తైవాన్‌కి 400 మిలియన్‌ డాలర్ల మిలటరీ ప్యాకేజిని వైట్‌హౌస్‌ తిరస్కరించింది. మూడు నెలల తర్వాత 11 బిలియన్‌ డాలర్ల ఆయుధాల విక్రయాన్ని తైవాన్‌కి జరపనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌కు నోటిఫై చేసింది. అయితే, ట్రంప్‌, జిన్‌పింగ్‌ల సమావేశానికి సంబంధించిన అనిశ్చిత స్థితి వల్ల వెల్లడి కాలేదు.

అయితే, గత ఫిబ్రవరిలో తైవాన్‌కి ఆయుధాల విక్రయం గురించి జిన్‌పింగ్‌కి ట్రంప్‌ తెలియజేసినట్టు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి తైవాన్‌కి చేరే ఆయుధాల విలువ మరింత పెరిగింది. ట్రంప్‌ ఇరాన్‌ యుద్ధ కార్యక్రమాల్లో హడావుడిగా ఉన్నందున తైవాన్‌కి ఆయుధ విక్రయంలో ఆలస్యం జరిగింది. నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికల లోపుగా ఈ ఒప్పందం అమలులోకి రావాలి.

ట్రంప్‌ తైవాన్‌తో సెమీ కండక్టర్‌ తయారీ పరిశ్రమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవల్సి ఉంది. తైవాన్‌ సెమీ కండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ) ప్రపంచంలో వినియోగించే సెమీకండక్టర్లలో 90 శాతాన్ని తయారు చేస్తుంది. ప్రపంచంలోని ఏఐ డేటా సెంటర్లన్నింటికీ సెమీ కండక్టర్లను సరఫరా చేస్తుంది. పాశ్చాత్య దేశాల మౌలిక సదుపాయాలకు అవసరమైన డిజిటల్‌ సరఫరాలను చేస్తుంది. చమురు కన్నా చిప్స్‌ తయారీ వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుంది.

సెమీ కండక్టర్ల విషయం కూడా ట్రంప్‌ చర్చించే అవకాశం ఉంది. తైవాన్‌తో సంబంధాల మెరుగుదల వల్ల 23 మిలియన్‌ ప్రజల భవిష్యత్‌ ముడిపడి ఉంది. అంతేకాక, వచ్చే దశాబ్దాల్లో సాంకేతికంగా, సైనిక పరంగా సమతూక స్థితిని కాపాడుకోవల్సి ఉంది.

అలిసియా గార్సియా హెర్రెరో
సీనియర్‌ ఫెలో, బ్రూగెల్‌, చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌ అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌

Leave a Reply