పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 6 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 6 మంది అరెస్ట్

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం మెరుపు దాడి చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ జి. అనిల్ రెడ్డి తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి నిర్వహించగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి రూ.23,110 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply