కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని మంగళవారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వి ప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న దయతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
