నేడు ఎస్సీ కార్పొరేషన్ పథక లబ్ధిదారుల ఇంటర్వ్యూలు..

నేడు ఎస్సీ కార్పొరేషన్ పథక లబ్ధిదారుల ఇంటర్వ్యూలు..
- భీమ్‌గల్ మండలంలో 71 మంది దరఖాస్తుదారులకు అవకాశం..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎస్సీఏపీ ( ఎస్సీ ఏపీ) ఫేజ్-11 పథకం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు భీమ్‌గల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. భీమ్‌గల్ మండలానికి చెందిన ఎస్సీ వర్గ అభ్యర్థులు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు (ప్యాసింజర్/గూడ్స్), ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలు (ప్యాసింజర్/గూడ్స్), పాడి పశువుల యూనిట్ల కోసం మొత్తం 71 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలను ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 11:30 గంటలకు భీమ్‌గల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలలో మండల అభివృద్ధి అధికారి, స్పెషల్ ఆఫీసర్, సంబంధిత బ్యాంకు మేనేజర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని, హాజరయ్యే సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, దరఖాస్తు ప్రతులు, సంబంధిత ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. ఇంటర్వ్యూకు గైర్హాజరైన వారి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.
