ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన బోధన ఉత్తమ ఫలితాలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యాబోధనలు చేపట్టడంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఊట్కూర్ సర్పంచ్ ఎం రేణుక భరత్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబాజీ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
సైన్స్ విద్యార్థులకు ప్రయోగశాలలు ఉచిత అడ్మిషన్లు పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనం మంజూరు చేస్తుందని అన్నారు. కళాశాల విద్య కమిషన్ ఆదేశాల మేరకు వారం రోజులపాటు వివిధ విద్య అవగాహన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శివలీల, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
