గంగాపూర్ రేషన్ షాప్ డీలర్‌కు ఆర్థిక సాయం అందజేత
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని గంగాపూర్ రేషన్ షాప్ డీలర్ వెడమ లచ్చయ్య ఇటీవల అనారోగ్యానికి గురై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం రేషన్ షాప్ డీలర్ల సంఘం కడెం మండల అధ్యక్షుడు కే. రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండలంలోని రేషన్ షాప్ డీలర్లు కలిసి వెడమ లచ్చయ్యకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్లు కె.వి. లక్ష్మీనరసయ్య, షేక్ అజీజ్, ముల్కాల శంకర్, ఎన్. ప్రసాద్, చంద్రహాస్, డి. రాజశేఖర్, ఎండి. షర్ఫుద్దీన్, ఆర్. సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
