6:25PM | తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌న

6:25PM | తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌న

6:25PM | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వ‌రుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత న‌రేంద్ర మోదీ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వ‌స్తున్నారు. ప్ర‌ధాన మంత్రి తెలంగాణ ప‌ర్య‌ట‌న ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఐదు గంటల పాటు నగరంలో గడపనున్న ప్రధాని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:55 గంటలకు మాదాపూర్‌లోని HICCకి చేరుకుని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:25 గంటలకు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌కు చేరుకుంటారు. రాత్రి 7:20 గంటలకు: పర్యటన ముగించుకుని తిరిగి గుజరాత్‌కు బయలుదేరుతారు.

Leave a Reply