10thmay | సీంఎ రేవంత్‌కు ఆహ్వానం
10thmay | సీంఎ రేవంత్‌కు ఆహ్వానం
10thmay |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రోటోకాల్ వివాదాల కారణంగా గత ప్రభుత్వ హయాంలో ప్రధాని పర్యటనల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉండేవారు. కానీ ఈ సారి ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌కు పిలుపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హాజరు కావాలని కోరుతూ కేంద్రం శనివారం ఆహ్వాన పత్రం అందజేసింది. జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికి, హెచ్‌ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
