1June2026 | చారిత్రాత్మక నిర్ణయమని సీఎం హర్షం

1June2026 | చారిత్రాత్మక నిర్ణయమని సీఎం హర్షం

1June2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కీలక అడుగు వేసింది. ఇండియన్స్ రైల్వేస్ ఆధ్వర్యంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు ధన్యవాదాలు తెలిపారు. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక రైల్వే సెక్షన్లు విశాఖ డివిజన్‌లో విలీనం కావడం శుభపరిణామమన్నారు. ఈ మార్పులతో ఉత్తరాంధ్ర రవాణా రంగం కొత్త దిశలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన విశాఖ, రాయగడ డివిజన్ల సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రగతికి ఈ జోన్ ఏర్పాటు కీలకంగా మారుతుందని సీఎం వివరించారు.

Leave a Reply