పది ఫలితాల్లో … ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పది ఫలితాల్లో … ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ
- 98 శాతం ఉత్తీర్ణత
మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన పదవతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన కొక్కుల ఉజ్వల (564), పైళ్ళ శ్రావ్య (552 ), కొక్కుల ఉషశ్రీ( 549 ) మార్కులు సాధించినట్లు తెలిపారు. 21మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా సాధించినట్లు, మొత్తం 103 మంది విద్యార్థులలో 101 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా 98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
