టెన్త్‌లో మండల టాపరుగా స్లేట్ విద్యార్థిని..

టెన్త్‌లో మండల టాపరుగా స్లేట్ విద్యార్థిని..

ద్వితీయ స్థానం కిష్టాపూర్ హైస్కూల్ విద్యార్థిని కైవసం..

జన్నారం, ఆంధ్రప్రభ : టెన్త్ పరీక్షల ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. టెన్త్ లో మంచిర్యాల జిల్లా జన్నారం మండల టాపరుగా స్లేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన అల్వియా శిఫాలి 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించింది. మండల ద్వితీయ టాపరుగా మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ కు చెందిన లశెట్టి శ్వేత 582 మార్కులతో నిలిచింది.మండలంలోని 18 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని టెన్త్ విద్యార్థులు 650 మంది పరీక్షలు రాయగా, 642 మంది ఉత్తీర్ణులైనట్లు స్థానిక ఎంఈఓ నడిమెట్ల విజయకుమార్ సాయంత్రం తెలిపారు. అందులో 13 ప్రభుత్వ,ప్రైవేటు హైస్కూళ్లు టెన్త్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఆయన చెప్పారు. 5 హైస్కూళ్లు 99శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

రాఘవేంద్ర సంస్థల్లో 100శాతం ఉత్తీర్ణత..

మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్, జయరాణి హైస్కూళ్లలో టెన్త్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల చైర్మన్,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, కరస్పాండెంట్ ఎర్ర సంపత్ కుమార్, ప్రిన్సిపాళ్లు ఎ.శ్రీనివాస్, ఎస్.మధుసూదన్,డీన్ హేమలత షిండే తెలిపారు.ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులందరిని వారు అభినందించారు.

మండల టాపరుగా స్లేట్ విద్యార్థిని..

టెన్త్ పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్ కు చెందిన అల్వియా శిఫాలి 600 మార్కులకుగాను 583 మార్కులు సాధించి మండల టాపరుగా నిలిచిందని ఆ స్లేట్ హైస్కూల్ ఫౌండర్ ఏనుగు సుభాష్ రెడ్డి,కరస్పాండెంట్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.తమ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణ సాధించినట్లు వారు చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులందరిని వారు అభినందించారు.

Leave a Reply