HYD | లక్షల విలువైన ఫర్నిచర్ దగ్ధం..

HYD | లక్షల విలువైన ఫర్నిచర్ దగ్ధం..
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ పరిధిలో సోఫా వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వర్క్‌షాప్‌లో ఉన్న లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ కాలిబూడిదైంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో వర్క్‌షాప్ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపించారు. సకాలంలో సహాయక చర్యలు అందకపోవడం వల్లే భారీగా ఆస్తి నష్టం జరిగిందని వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

