నచ్చన్ ఎల్లాపూర్‌లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాలుగా నచ్చన్ ఎల్లాపూర్‌తో పాటు కడెం మండల కేంద్రంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, పీడీఎస్యూతో జిల్లా అధ్యక్షుడు రాజేష్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల నాయకులు సంజీవ్ పటేల్, కోలా శ్రీను, ముస్కు రాజు, రమేష్, కృష్ణ, తిరుపతి, ఉప సర్పంచ్ ఆనంద్, ఈజీఎస్ఎఫ్‌ఏ కమలాకర్, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు లింగన్న, వార్డు సభ్యులు అంబాజీ, ఉదయ్, దేవా, గ్రామస్తులు శ్రీనివాస్, నారాయణ, మధు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply