పెట్రోల్, డీజిల్ కొరత..

ఆందోళనలో వాహనదారులు
తొర్రూరు టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ) : డివిజన్ కేంద్రంలోని పెట్రోల్ పంపుల్లో గత రాత్రి నుండి నిల్వలు లేకపోవడంతో వాహనదారులు బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆందోళన చెందుతున్నారు. ఇటు వంటగ్యాస్ కొరత, మరోవైపు పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సరిపడా ఇందన నిల్వలు సప్లై చేయాలని కోరుతున్నారు.
