కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …
బాధ్యతల స్వీకరణ తర్వాత తొలి దర్శనం
ఆలయ అధికారుల ఘన స్వాగతం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్ఈసీ
భక్తుల సౌకర్యాలపై ఈవోతో చర్చ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చంద్ర పునేఠా మొదటిసారిగా విజయవాడ లోని ఇంద్రకీలాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం ఈవో వికే శీనా నాయక్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో శీనా నాయక్ అందజేశారు. దర్శనానంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఎన్నికల కమిషనర్, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. రద్దీ సమయంలో భక్తులకు కలిగే ఇబ్బందులు, క్యూలైన్ల నిర్వహణ, శుచిత్వం వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
