ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

రాప్తాడు, ఆంధ్రప్రభ : ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు పదే పదే తెలియజేస్తున్నారు. అలాగే మన జిల్లాలో ఇప్పటికే ఎండల వేడికి గర్భవతులు ప్రజలు తట్టుకోలేక పోతున్నారని డాక్టర్ శివకృష్ణ పేర్కొన్నారు.గురువారం రాప్తాడు మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రామం నందు ఏఎన్ఎం నాగలక్ష్మి ఆశ విజయలక్ష్మి గ్రామంలో గర్భవతులకు ఉపాధి కూలీలకు ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సంధర్భంగా మాట్లాడుతూ గర్భవతులు బాలింతలకు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.బయట ఎండలు 42 నుండి 44 డిగ్రీల వరకు ఉన్నాయి. ఈ వేడి ఎండలు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అందువలన గర్భవతులు చిన్నపిల్లలు బాలింతలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరచూ మంచినీళ్లు మజ్జిగ తాగాలి గాలి ఆడే ప్రదేశంలో కూర్చోవాలి. అలాగే కొంచెం నీరసం అనిపించిన వెంటనే ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ను కలుపుకొని తాగాలి (లేదా) ఒక లీటర్ నీటిలో ఒక చిటికెడు ఉప్పు గుప్పెడు చక్కెర కలుపుకొని త్రాగాలి.

ప్రతిరోజు సాయంత్రం పూట ఇళ్ళ ముందు నీళ్లు ఎక్కువగా చల్లుకోవడం వలన వేడుతాపం తగ్గే అవకాశం ఉంది అప్పుడు ఆరు బయట కూర్చోవడానికి బాగుంటుందన్నారు. గ్రామాల్లో గర్భవతులు బాలింతలు ఏఎన్ఎం ఆశకు అందుబాటులో ఉండాలన్నారు. సమస్య ఏదైనా చిన్నదైనా పెద్దదైనా వెంటనే ఆశకు సమాచారం అందించాలన్నారు.

ఏఎన్ఎం ఆశ అందించే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.ఉపాధి కూలీలు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగలక్ష్మి ఆశ విజయలక్ష్మి అంగనవాడీ టీచర్ సరస్వతి రైతులు సోమర మోహనప్ప శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం మహేంద్ర ఉపాధి కూలీలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply