గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి.

గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి.

ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటలక్ష్మి.

దండేపల్లి, ఆంధ్రప్రభ : గర్భిణీ మహిళలు బాలింతలు సరైన పౌష్టిక ఆహా రం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటలక్ష్మి,గుడిరేవు గ్రామసర్పంచ్సంతపురి కళావతి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సూచించారు. మండలంలోని గుడిరేవు అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ,గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ సంతపురి కళావతి, ఐసిడిఎస్ సూపర్ వైజార్ వెంకటలక్ష్మి, ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అక్షరాబ్యాసం తోపాటు, అన్న ప్రసన్న, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వ పౌష్టికాహారం సరుకులు మధ్యాహ్న భోజనం తో పాటు ఆటపాటల ద్వారా విద్యా బోధన అందిస్తారన్నారు గర్భిణీ మహిళలు ప్రతి రోజు ఆకుకూరల తోపాటు, కూరగాయలు, పండ్లు, వంటి సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు శిశు పోషణ పై అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో,అంగన్వాడీ టీచర్ లు లక్ష్మి,రాజేశ్వరి, ఆయా సుజాత,గర్భిణీ మహిళలు,బాలింతలు చిన్న పిల్లతల్లులు, పాల్గొన్నారు.

Leave a Reply