లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
కరీంనగర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వరంగల్ వెళుతుండగా బైపాస్ వద్ద లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అనుభవం లేని డ్రైవర్ లతో బస్సు నడిపించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

