ఆపదలో అండగా ప్రభుత్వం..

ఆపదలో అండగా ప్రభుత్వం..

ఖానాపూర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మండల పరిధిలోని ఎర్వచింతల్ గ్రామంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో చిట్యాల రాజనర్సుకు రూ.39,000, ఇస్లావత్ వెంకటేష్‌కు రూ.32,000 విలువైన చెక్కులను అందజేశారు. ఆపద సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమకు అందిన సహాయంపై ముఖ్యమంత్రికి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు భిక్కు నాయక్, కొడారి నరేష్, కళ్యా నాయక్ వెంకటేష్, ఫకీర్ సింగ్, చిన్న రాజన్న, రవి, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply