పవన్ కళ్యాణ్ కోసం.. ప్రత్యేక పూజలు..

పవన్ కళ్యాణ్ కోసం.. ప్రత్యేక పూజలు..
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు కొణిదల పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జన సాధక్ లింగం నాగేశ్వరరావు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కి సత్వరమే ఆరోగ్య సిద్ధి ప్రాప్తించాలని, వెంటనే కోలుకోవాలని కోరుతూ సోమవారం కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో లింగం నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండటం, అలుపెరుగని ప్రయాణాలు చేస్తూ ప్రజల కష్టాలు తీర్చడానికి రేయింబవళ్ళు శ్రమిస్తూ, ఆరోగ్యం గురించి పట్టించుకోక పోవడం చేత అస్వస్థతకు గురయ్యారని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగేశ్వరరావు వివరించారు. పవన్ కల్యాణ్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న తరుణంలో అస్వస్థతకు గురి కావడం బాధాకరమని,ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగక శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకుని, తిరిగి ప్రజా క్షేత్రంలో మరింత శక్తివంతంగా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తారని నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని మోదీ మొదలుకుని చిన్న స్థాయి కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ వెంటనే కోలుకోవాలని ఆశిస్తున్నారని, ఒక గొప్ప ప్రజా నాయకుడికి లభించే గౌరవం ఇదే అని లింగం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పుప్పాల సూర్యనారాయణ, అమ్మిశెట్టి సతీష్, వెంటపాటి శివ, ర్యాలీ సత్యనారాయణ, శేషగిరి,వీర మహిళలు, జన సైనికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

