మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేపీ

బెజ్జంకి, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడాన్ని బీజేపీ బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షుడు కొలిపాక రాజు ఖండించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లుకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ వ్యవహరించడం మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, “నారీ శక్తి వందన్ అధినియం” ద్వారా మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

కాంగ్రెస్ వెంటనే తన వైఖరిని మార్చుకొని మహిళలకు క్షమాపణ చెప్పి బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మండల నాయకులు గైని రాజు,సంగా రవి , లెంకల కిషన్ రెడ్డి, దొమ్మటి రాములు, వడ్లూరి సాయిలు,లొనే నర్సింగం,వడ్లూరి శ్రీను బుర్ర కిషన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply