మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక

మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల ఆధ్వర్యంలో కో-ఆప్షన్ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్టు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ శుక్రవారం తెలిపారు. రాంనగర్ మాజీ కౌన్సిలర్ సత్తయ్యగారి శివశంకర్ (శివుడు), కల్వకుంట యశోద, రిక్షా కాలనీకి చెందిన మొహమ్మద్ సలాద్దీన్ (బాబూ)ను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఈ ఎంపికలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ, అనుభవజ్ఞులైన నాయకులను ఎంపిక చేసినట్లు పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవలో మరింత చురుకుగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
